భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ మండల సమైక్య సమావేశం సుమలత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాల వసూళ్లు, అలాగే కొత్త వ్యాపారాల ఏర్పాటుపై ఏపీఎం సంగమేశ్వర్ వివరించారు. పోషణ అభియాన్‌లో భాగంగా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సరస్వతి, లక్ష్మి, కవితలు స్త్రీల ఆరోగ్యం, పిల్లల పోషణ గురించి క్లుప్తంగా తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్డిపల్లి పీహెచ్‌సీ హెల్త్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. స్త్రీల ఆరోగ్యంపై, రక్తహీనతపై చర్చించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పోషణ, పరిసరాల పరిశుభ్రత…





