భారత్ సమాచార్.నెట్: పొరుగు దేశం పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికగా భారత్ మరోసారి ఎండగట్టింది. దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సొంత ప్రజలపై బాంబు దాడులు చేస్తోందని.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్ విమర్శించింది. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాక్ సైన్యం జరిపిన వైమానికి దాడిని ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది భారత్.
ఐకర్యరాజ్య సమితి మానవ హక్కుల వేదికపై భారత్ ప్రతినిధి క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ.. ప్రజలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వమే వారి ప్రాణాలు తీస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దాయాది దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందన్నారు. అంతే కాదు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
భారత్ భూభాగాన్ని ఆక్రమించాలన్న ఆలోచనను విరమించుకుని.. తమ దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సైనిక ఆధిపత్యంతో ఆ దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా అణిచివేయబడిందని.. మానవ హక్కులకు రక్షణ లేకుండాపోయిందన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. సొంత ప్రజలపైనే దాడులు చేస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గురించి మాట్లాడే నైతిక్ హక్కు లేదని వ్యాఖ్యానించారు.
మరిన్ని కథనాలు:
భారత్ సమాచార్ ఈ-పేపర్