భారత్ సమాచార్.నెట్: పొరుగు దేశం పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికగా భారత్ మరోసారి ఎండగట్టింది. దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సొంత ప్రజలపై బాంబు దాడులు చేస్తోందని.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్ విమర్శించింది. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాక్ సైన్యం జరిపిన వైమానికి దాడిని ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది భారత్.
ఐకర్యరాజ్య సమితి మానవ హక్కుల వేదికపై భారత్ ప్రతినిధి క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ.. ప్రజలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వమే వారి ప్రాణాలు తీస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.…

