భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

సంఘటితంతోనే ఐక్యత బలం..

WhatsApp Image 2025-09-24 at 7.44.04 PM (1)

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా : కులమతాలకు అతీతంగా సంఘటితంగా ఉండటమే నిజమైన బలం అని ధర్మ జాగరణ్ ప్రముఖ ఆచార్య నరేంద్ర జి అన్నారు. బుధవారం తూప్రాన్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో దుర్గా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందువులందరూ సంస్కృతి, సంప్రదాయాలపై శ్రద్ధ వహించాలని, కులమతాలకు అతీతంగా హిందూ ధర్మం వైపు పయనించాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, ధార్మిక భావాలను నింపాలని సూచించారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల హిందూ శాస్త్రాలు, పురాణాలను అందరికీ తెలియజేయాలని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ధర్మ జాగరణ్ ప్రముఖ ఆచార్య నరేంద్ర జీతో పాటు మామిడి వెంకటేష్, అశోక్ గౌడ్, కోటేశ్వరరావు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హిందూ ధర్మం, ఐక్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు : 

 

ఆదర్శ ఉత్తమ రైతు సన్మాన మహోత్సవం