భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

జీఎస్టీపై మెద‌క్ ఎంపీ అవగాహన కార్యక్రమం

WhatsApp Image 2025-09-24 at 8.20.58 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా : రామాయంపేట పట్టణంలోని వ్యాపార వర్గాలకు జీఎస్టీపై అవగాహన కల్పించే కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు దుకాణాలను స్వయంగా సందర్శించి, వ్యాపారస్తులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ విధానాలు, తగ్గింపు రేట్లు, పన్ను చెల్లింపులో ఉన్న సౌలభ్యాలను వివరించారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

నూత‌న వస్త్ర దుకాణం ప్రారంభోత్స‌వంలో కాంగ్రెస్ నేత‌