భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : రామాయంపేట పట్టణంలోని వ్యాపార వర్గాలకు జీఎస్టీపై అవగాహన కల్పించే కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు దుకాణాలను స్వయంగా సందర్శించి, వ్యాపారస్తులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ విధానాలు, తగ్గింపు రేట్లు, పన్ను చెల్లింపులో ఉన్న సౌలభ్యాలను వివరించారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ…





