భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

ఎల్వోసీ ప‌త్రాన్ని అంద‌జేసిన ఎమ్మెల్యే

07

భారత్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎం సహాయ నిధి వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌కు చెందిన షేక్ ఇబ్రహీం అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2,50,000 ఎల్వోసీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ విజయ్ కుమార్, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

నారాయణఖేడ్‌లో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్య‌క్ర‌మం