భారత్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎం సహాయ నిధి వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌కు చెందిన షేక్ ఇబ్రహీం అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2,50,000 ఎల్వోసీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ…