భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

పంట నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

WhatsApp Image 2025-09-27 at 1.49.38 PM

భార‌త్ స‌మాచార్‌.నెట్, సంగారెడ్డి జిల్లా: భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్డును శనివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్షణమే ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలు, వాహనదారులను అప్రమత్తం చేయాలని సూచించారు.

అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను స్థానిక రైతులు కలిసి, రోడ్డు కొట్టుకుపోవడం వల్ల సుమారు 40 ఎకరాల వరి, పత్తి పంటలు నీట మునిగాయని దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ఆవేదన విన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆయన సూచించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

ప్రేమ పేరుతో మోస‌పోయిన యువ‌తి ఎస్పీకి ఫిర్యాదు..