భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్డును శనివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్షణమే ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలు, వాహనదారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను స్థానిక రైతులు కలిసి, రోడ్డు కొట్టుకుపోవడం వల్ల సుమారు 40 ఎకరాల వరి,…





