భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

Devara 2: దేవర 2పై కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్

ntr-devara-2-2025-09-27-18-45-10

భారత్ సమాచార్.నెట్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. గతేడాది విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నెలలు గడుస్తున్న సీక్వెల్‌పై ఎలాంటి అప్డేట్‌ ఇవ్వలేదు మేకర్స్. తాజాగా దేవర 2పై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

 

అయితే దేవర 1 సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తి కావడంతో దేవర 2కు సంబంధించిన పోస్టర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవర 2 కోసం సిద్ధంగా ఉండాలంటూ పేర్కొంటూ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దేవరగా ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున కూర్చున్న ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఇతర సినిమాల కమిట్మెంట్ కారణంగా దేవర 2 షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

 

ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ మూడూ ప్రాజెక్టుల తర్వాతే దేవర 2 షూటింగ్ ప్రారంభం అవుతుందని అర్థమవుతోంది. కాగా, నెల్సన్ జైలర్ 2 సినిమాతో బిజీగా ఉండగా.. త్రివిక్రమ్ స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కొరటాల శివా దేవర 2 స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని కథనాలు:

మరోసారి తండ్రైన ‘కలర్ ఫొటో’ హీరో