భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో దీక్ష మొదలైంది. అమరవీరుల స్థూపం వద్ద మేర కుల సంఘం నాయకుడు బాలరాజు దీక్ష చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లోని బోయిన్పల్లి ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్న నళిని ఆరోగ్యం విషమంగా ఉందని బాలరాజు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని నళిని వైద్య ఖర్చులు భరించడంతో పాటు ఆమెకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని కోరారు. ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమేనని, డిమాండ్ కాదని స్పష్టం చేస్తూ ఉద్యమకారిణిని కాపాడవలసిందిగా బాలరాజు ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్ని కథనాలు :
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఐలయ్య కృతజ్ఞతలు