భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

నేటి నుంచే ఎన్నిక‌ల‌ కోడ్ అమలు: క‌లెక్ట‌ర్

07

భారత్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు సోమవారం నుంచే జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (MCC) అమల్లోకి వస్తుందన్నారు.

కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమాచారం, ఫిర్యాదుల కోసం 8125352721 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, అదనపు జడ్పీ సీఈవో స్వప్న, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి: కలెక్టర్ ప్రావీణ్య