భారత్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు సోమవారం నుంచే జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (MCC) అమల్లోకి వస్తుందన్నారు.

కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమాచారం, ఫిర్యాదుల కోసం 8125352721 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు…