భారత్ సమాచార్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు దంపతులు సద్దుల బతుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తొమ్మిది రోజులు పూజలు అందుకున్న బతుకమ్మ తల్లి ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలతో సాగనంప బడుతుందని, అమ్మవారి కృప వలన సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డిప్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీయం యూనిట్ హెడ్ ఏకే మిశ్రా, మాజీ శాసనసభ్యులు పాల్వాయి రాజ్యాలక్ష్మీ, నాయకులు డా.కొత్తపల్లి శ్రీనివాస్, కొంగ సత్యనారాయణ, ఈర్ల విశ్వేశ్వరరావు, సిందం శ్రీనివాస్, కొండ్ర మనోహర్ గౌడ్ , కొప్పుల శంకర్, శివ గౌడ్, అరుణ్ లోయ, వీరభద్రా చారి, చిలువేరు ప్రవీణ్, నానాజీ, దేశ్ముఖ్ సాయి చరణ్, పోలాడి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.