భారత్ సమాచార్.నెట్: తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. బస్సులు సహా అన్ని రవాణా వాహనాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సోమవారం నుంచే జాతీయ, రాష్ట్ర జిల్లా రహదారులపై సోదాలు చేస్తున్నారు అధికారులు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఒక్క వ్యక్తి గరిష్టంగా రూ.50,000 నగదు మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ నగదు తీసుకువెళ్ళాలనుకుంటే, సరైన పత్రాలు తప్పనిసరి. పోలీసుల తనిఖీలల్లో సరైన పత్రాలు లేకపోతే నగదును సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఒక్కవేళ ఎక్కువ మొత్తంలో దొరికితే.. ఐటీ అధికారులకు సమాచారం అందించి.. ఆ నగదును కోర్టులో జమ చేస్తారు.
అయితే తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేదా ఆధారాలు చూపలేకపోయిన.. తర్వాత ఆ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి పొందవచ్చు ప్రజలు. ఇక ఎన్నికల కోడ్ నియామావళి ప్రకారం.. ప్రభుత్వం లేదా పాలన పక్షానికి చెందిన నాయకులు కొత్త పథకాలను ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేని సంగతి విధితమే.
మరిన్ని కథనాలు:
అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్..