భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

అమ‌ల్లోకి ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి: క‌లెక్ట‌ర్

WhatsApp Image 2025-09-30 at 10.11.50 PM

భారత్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) కచ్చితంగా అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు నిబంధనలు 100% పాటించడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 25 జెడ్పీటీసీ, 261 ఎంపీటీసీ స్థానాలకు, 613 గ్రామ పంచాయతీలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి మలివిడత శిక్షణ ఇస్తున్నామని, సోషల్ మీడియా విషయంలో జాగ్రత్త వహించాలని పార్టీలకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

రేపటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు