భారత్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) కచ్చితంగా అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు నిబంధనలు 100% పాటించడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 25 జెడ్పీటీసీ, 261 ఎంపీటీసీ స్థానాలకు, 613 గ్రామ పంచాయతీలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు…