భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి(22), సంతోష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో సెప్టెంబరు 26న వీరి పెళ్లి జరిగింది. దసరా పండగ సందర్భంగా ఈ నెల 2న గంగోత్రి.. భర్తతో కలిసి పుట్టింటికి రాగ.. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం సంతోష్ భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లగా గంగోత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురవడం, అత్తింట్లో ఏదైనా జరగడం వల్ల తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరిన్ని కథనాలు:
కరీంనగర్ జిల్లాలో రెండు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు