భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

Bihar Elections: బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

bihar-assembly-elections-schedule-2025-10-06-17-08-19

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రెండు విడతల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈసీ ప్రెస్ మీట్‌లో బీహార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో విడత పోలింగ్ నవంబర్ 11న నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 14న జరగనుందని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా స్పష్టం చేశారు. కాగా, బీహర్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 22తో అసెంబ్లీ గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది.

 

ఇకపోతే బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఈసీ ఓటర్ల జాబితా అధికారికంగా ప్రచురించింది. ఇందులో 14 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లకు పైబడిన ఓటర్‌ల్లో 14వేల మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల నిశ్పాక్షికత, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 17 కీలక సవరణలను ప్రవేశపెట్టనుంది. వీటిలో కొన్ని సవరణలు పోలింగ్ సమయంలో.. మరికొన్ని ఓట్ల లెక్కింపు సమయంలో వర్తించనున్నాయి.