భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: ప్రముఖ సినీ గేయ రచయిత జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తల్లిదండ్రులు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ సాహితీ ,జానపద, నృత్య పురస్కారాల ప్రధానోత్సవం ఈనెల 13న హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో గల సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్నట్లు అశోక్ తేజ తమ్ముడు సుద్దాల ప్రభాకర్ తేజ తెలిపారు. మంగళవారం మోత్కూరులో ప్రజాభారతి సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు బి హనుమంతు పూర్వ అధ్యక్షుడు కవి దేవినేని అరవిందరాయుడుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో , సుద్దాల అశోక్ తేజ నేతృత్వంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయిత్రి వోల్గా ,ప్రముఖ జానపద ,సినీ గాయని మధుప్రియ, ప్రముఖ నర్తకీమణి లాలీ నిధి లకు ఈ పురస్కారాలు అందజేయనున్నట్టు తెలిపారు.
మరిన్ని కథనాలు:
అవరోధాలను అధిగమించి.. అనుకున్నది సాధించి