భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట: జిల్లా పోలీస్ కమిషనర్‌గా ఎస్.ఎం. విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రెస్ మీట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తామని, గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు, భరోసా సెంటర్ సేవలు వినియోగిస్తామన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఇసుక అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంటుందని, డీజేల వాడకంపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు డయల్ 100 లేదా 1930కు కాల్ చేయాలని సూచించారు.
మరిన్ని కథనాలు
సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా యస్. యం. విజయ్ కుమార్