భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట: జిల్లా పోలీస్ కమిషనర్‌గా ఎస్.ఎం. విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రెస్ మీట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తామని, గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు.

మహిళల భద్రత కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు, భరోసా సెంటర్‌ సేవలు వినియోగిస్తామన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసే వారిపై…