భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

‘మోటకొండూరు అభివృద్ధికి సీపీఎంను గెలిపించండి’

WhatsApp Image 2025-10-08 at 7.05.54 PM

భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాల్‌రాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా లింక్ రోడ్లు, శాశ్వత ప్రభుత్వ కార్యాలయ భవనాలు వంటి సమస్యలతో మండలం వెనుకబడిందన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం నిరంతరం పోరాడుతోందని, గతంలో నక్కల కులం సర్టిఫికెట్లు, రైతులకు భూమి పట్టాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. మండల సమగ్ర అభివృద్ధి కోసం సీపీఎంను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొలగాని జయరాములు, పార్టీ మండల కార్యదర్శి కొల్లూరు అంజనేయులు, మండల కమిటీ సభ్యులు వడ్డేబోయిన మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

కెరీర్‌లో స్థిరపడటానికి ఎంబీఏ కీలకం