భారత్ సమాచార్.నెట్, నల్లగొండ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. నల్లగొండ, దేవరకొండ డివిజన్ల పరిధిలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఎన్నికల ఏర్పాట్లపై కీలక ప్రకటన చేశారు. జిల్లాలో మొత్తం 18 ZPTC స్థానాలు, 197 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చని, అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటలు నామినేషన్లకు చివరి తేదీ అని కలెక్టర్ స్పష్టం చేశారు.
అభ్యర్థులు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్ ప్రాసెషన్ 100 మీటర్ల పరిధికి మించరాదని హెచ్చరించారు. ఫిర్యాదులు, సూచనల కోసం అన్ని MPDO కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
మరిన్ని కథనాలు :
బాలికపై హత్యాచారం ఘటనపై ఎస్పీ సీరియస్