భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

“శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్య ముఖ్యమే”

21

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: నేటి కాలంలో విద్యార్థులు, యువతలో పెరుగుతున్న మానసిక సమస్యలు, తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యువత మానసిక ఒత్తిడికి లోను కావద్దని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఈ బయ్యారం ఎస్ఐ సురేష్ సూచించారు. శుక్రవారం వారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో యువతకు పలు సూచనలు చేశారు. మనిషికి శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం అన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు, యువతను మానసిక సమస్యలు పీడిస్తున్నాయని చదువుల ఒత్తిడిలో విద్యార్థులు, కెరీర్‌, ఉద్యోగాలు అంటూ యువత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటు ఆందోళనతో కుంగిపోతున్నారన్నారు. ఆ సమస్యను కుటుంబ సభ్యులకూ చెప్పుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇది చాలా బాధాకర విషయం అన్నారు. భారతదేశానికి యువరక్తం ఎంతో అవసరం అన్నారు. ఈతరం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని ఇటువంటి వాటిని ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చన్నారు. సమస్యలు ఉంటే స్నేహితులకు గాని తల్లిదండ్రులకు గాని తెలపాలన్నారు దీనివల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని జీవితం చాలా విలువైనదని తెలిపారు.

మరిన్ని కథనాలు: 

బాణసంచా అక్రమ నిల్వలపై దాడులు