భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: నేటి కాలంలో విద్యార్థులు, యువతలో పెరుగుతున్న మానసిక సమస్యలు, తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యువత మానసిక ఒత్తిడికి లోను కావద్దని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఈ బయ్యారం ఎస్ఐ సురేష్ సూచించారు. శుక్రవారం వారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో యువతకు పలు సూచనలు చేశారు. మనిషికి శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం అన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు, యువతను…