భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : ప్రజా ప్రతినిధిగా నిత్యం బిజీగా ఉండే నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి నేడు మెదక్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. నియోజకవర్గ ప్రజల పట్ల తమకున్న అనుబంధాన్ని చాటుకుంటూ ఆమె ఈ వేడుకలో పాల్గొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్కు చెందిన ఆరుట్ల మల్లేష్ కుమార్తె వివాహం పట్టణ సమీపంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి వధూవరులను ప్రత్యేకంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య శ్రేణులు, నాయకులు అశోక్ గౌడ్, సత్యం గౌడ్, సూరారం నర్సింలు, షేక్ హుస్సేన్, పార్టీ పట్టణ అధ్యక్షులు పంబల్ల బిక్షపతి, తంగేడు ఆంజనేయులు, ఎల్లమయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు :
“ప్రజావాణి” ద్వారా త్వరిత పరిష్కారం: మెదక్ కలెక్టర్