భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : ప్రజా ప్రతినిధిగా నిత్యం బిజీగా ఉండే నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి నేడు మెదక్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. నియోజకవర్గ ప్రజల పట్ల తమకున్న అనుబంధాన్ని చాటుకుంటూ ఆమె ఈ వేడుకలో పాల్గొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్‌కు చెందిన ఆరుట్ల మల్లేష్ కుమార్తె వివాహం పట్టణ సమీపంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి వధూవరులను ప్రత్యేకంగా ఆశీర్వదించి, వారి…





