భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

తాండూరులో డంపింగ్ యార్డులా ప్రధాన రహదారి

WhatsApp Image 2025-10-13 at 8.23.17 PM

భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: తాండూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెళ్లే ప్రధాన మార్గం డంపింగ్ యార్డును తలపిస్తుండటంతో ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ స్వచ్ఛ ట్రాక్టర్ రోజువారీగా రాకపోవడం వల్లే స్థానికులు రోడ్లపై చెత్తాచెదారం పారవేస్తున్నారని, దీనిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆ వీధి ప్రజలు వాపోతున్నారు.

రోడ్లపై పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన వెదజల్లడం, దోమలు, ఈగల సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, పేరుకుపోయిన చెత్తను తొలగించి, పంచాయతీ ట్రాక్టర్ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

యువకుడిని పరామర్శించిన నాయకులు