భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: తాండూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెళ్లే ప్రధాన మార్గం డంపింగ్ యార్డును తలపిస్తుండటంతో ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ స్వచ్ఛ ట్రాక్టర్ రోజువారీగా రాకపోవడం వల్లే స్థానికులు రోడ్లపై చెత్తాచెదారం పారవేస్తున్నారని, దీనిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆ వీధి ప్రజలు వాపోతున్నారు.

రోడ్లపై పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన వెదజల్లడం, దోమలు, ఈగల సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, పేరుకుపోయిన చెత్తను తొలగించి, పంచాయతీ…