భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

మహిళకు పునర్జన్మనిచ్చిన పాల్వంచ డాక్టర్లు

WhatsApp Image 2025-10-14 at 8.25.47 PM

భారత్ స‌మాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. పాల్వంచకు చెందిన జయశ్రీ అనే మహిళకు అత్యంత క్లిష్టమైన ఓవారియన్ ట్యూమర్ (అండాశయ కణతి) ఆపరేషన్‌ను శ్రీ విజయనర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించిన స్కానింగ్‌లో అతిపెద్ద కణతిని గుర్తించారు. దీనికి స్పందించిన ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రోజా కిరణ్ నేతృత్వంలోని బృందం, సుదీర్ఘ శస్త్ర చికిత్స చేశారు.

ఏకంగా 17 కేజీల బరువున్న ట్యూమర్‌ను సురక్షితంగా తొలగించింది. శస్త్ర చికిత్స అనంతరం జయశ్రీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంతటి భారీ కణతిని తొలగించి తమ కుటుంబ సభ్యురాలికి పునర్జన్మ ఇచ్చిన వైద్య సిబ్బందికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

సమస్య పరిష్కారం కోసం పోరాటం ఉధృతం చేస్తాం:సీపీఎం