భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

గాలికుంటూ టీకాల కార్యక్రమం

7

భారత్ సమాచార్,  మెదక్ జిల్లా: శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో జాతీయ ఉచిత గాలికుంటూ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి Dr.వెంకటయ్యచే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం తో పాటు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పశుశాఖ అధికారి ప్రభాకర్ పాల్గొని పశువులలో కృత్రిమ గర్భధారణ వలన జరిగే మేలును రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో నర్సాపూర్AD జనార్దన్ రావు పాల్గొనడం జరిగింది. డాక్టర్. సంధ్య మండల పశువైద్యధికారి, ఫరహీన్, ప్రియాంక ,పవన్, రమాదేవి, కీర్తి,గోపాల మిత్ర గోపాల్, సూపర్ వైసర్ సత్యనారాయణ, వెంకట్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 15 నుండి నవంబర్ 14 వరకు జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని పాడి రైతులు వినియోగించుకోగలరన్నారు. ఈ రోజు 178 గేదలకి టీకాలు, 45 పశువులకి చుడి పరీక్ష, 32 దూడలకి నట్టల మందు ఇవ్వడం జరిగింది.

మరిన్ని కథనాలు: 

రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు