భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారుల ఫీల్డ్ ట్రిప్

Untitled02

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్ లో విద్యార్థులు సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని జేపీ ఫార్మ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రిథ్వీరాజ్ సమక్షంలో నిర్వహించిన అవగాహన కార్యక్రంలో విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల పెంపకం విధానాల గురించి వివరణాత్మకంగా తెలిపారు. చిన్నారులు స్వయంగా పంట పొలాలను సందర్శించి, వరి పంట, కూరగాయ పంటలు, కొబ్బరి చెట్లు, టేకు చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, ఉసిరికాయ, నిమ్మకాయ, మునక్కాయ, పాలకూర, తమలపాకు మొదలగునవి సేంద్రియ పంటలు ఎలా పండుతాయో నేర్చుకున్నారు. ఇలాంటి ఫీల్డ్ ట్రిప్స్ పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడమే కాకుండా సుస్థిర వ్యవసాయం వైపు కొత్త తరం దృష్టిని మలుస్తాయని ప్రిథ్వీరాజ్ పేర్కొన్నారు.