భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్ లో విద్యార్థులు సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని జేపీ ఫార్మ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రిథ్వీరాజ్ సమక్షంలో నిర్వహించిన అవగాహన కార్యక్రంలో విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల పెంపకం విధానాల గురించి వివరణాత్మకంగా తెలిపారు. చిన్నారులు స్వయంగా పంట పొలాలను సందర్శించి, వరి…