భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

ఉపాధ్యాయుడిని బెదిరించి దోపిడీ: ముగ్గురు పాత నేరస్తుల అరెస్ట్

WhatsApp Image 2025-10-18 at 5.36.56 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్: ఉపాధ్యాయుడిని కత్తితో బెదిరించి, నగదు, మొబైల్ ఫోన్ దోచుకున్న కేసులో ముగ్గురు పాత నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. కొల్చారంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కిష్టయ్యను గత గురువారం రోజు ఉప్పరి సాయికుమార్, గొలుసుల కుమార్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఆటో ఎక్కించుకున్నారు. నర్సాపూర్-తూప్రాన్ రహదారిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కత్తితో బెదిరించి రూ.1200 నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నర్సాపూర్ పోలీసులు, చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దోపిడీ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐ జాన్ రెడ్డి, ఎస్‌ఐ రంజిత్ కుమార్ రెడ్డితో పాటు సిబ్బందిని డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

సురక్షిత దీపావళిని జరుపుకోండి: మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్