భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

మాజీ MLA మైనంపల్లిని కలిసిన PRTU బృందం

1A

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: PRTU TS జిల్లా అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ ఆధ్వర్యంలో PRTU బృందం మెదక్ మాజీ MLA మైనంపల్లి హనుమంతరావుని కలవడం జరిగింది . ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు  జిల్లా కేంద్రంలో PRTU భవన నిర్మాణానికి గాను నిధుల మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదించగలరని కోరడమైనది. అదే విధంగా జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేయాలని సిరిసిల్ల జోన్ లో ఉండటం వలన జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పదోన్నతులలో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సాధారణ ఎన్నికల ముందు నర్సాపూర్ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతానని హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో  కలపాలని కోరారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను త్వరగా మంజూరు చేయించగలరని, వివిధ రకాల ఉపాధ్యాయ సమస్యలను హనుమంత రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.