భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని MDR ఫౌండేషన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. చీకట్లను తొలగించి వెలుగులను ప్రపంచానికి అందించే ఈ పండుగ సందర్భంగా సంతోషం, ఐకమత్యం, శాంతి పరస్పర సంబంధాలను బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ… “దీపావళి అనేది కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు. ఇది మన హృదయాల్లోని చీకట్లను తొలగించి ఆశ, ప్రేమ, ఐకమత్యం వెలుగులు నింపే పండుగ. ప్రతి ఒక్కరూ దీపావళిని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సమాజం మొత్తం వెలుగులతో నిండాలని మనస్ఫూర్తిగా ఆశీస్తున్నాను.” అని పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో సిబ్బంది, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న ప్రిథ్వీరాజ్, చివరగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
20, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్