భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని MDR ఫౌండేషన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. చీకట్లను తొలగించి వెలుగులను ప్రపంచానికి అందించే ఈ పండుగ సందర్భంగా సంతోషం, ఐకమత్యం, శాంతి పరస్పర సంబంధాలను బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ… “దీపావళి అనేది కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు. ఇది మన హృదయాల్లోని చీకట్లను తొలగించి ఆశ, ప్రేమ, ఐకమత్యం వెలుగులు నింపే పండుగ. ప్రతి ఒక్కరూ…