భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

కేసీఆర్ కాలనీని ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తాం

6

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలు నివాసముండే కేసీఆర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు.ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని, వారం రోజుల్లో సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను కాపాడుతూ, కాలనీ శుభ్రతలో భాగస్వామ్యులు కావాలని, చోరీల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికలు కూడా నిర్వహించారు.అధ్యక్షుడిగా డిజీ శ్రీనివాస శర్మ, గౌరవ అధ్యక్షులుగా బాలమణి, ప్రధాన కార్యదర్శిగా దిడ్డి మల్లేశం, కోశాధికారిగా దేవుని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రుద్రోజి స్వామి, కుద్బోద్దిన్, నమండ్ల రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాదుల యాదగిరి, తుజాల శ్రీనివాస్ గౌడ్, చిర్ర సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సలహాదారులుగా బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ఊడెం దేవరాజు, పటేరి రాము, కర్రే నరేందర్, కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటయ్య, బల్ల యాదగిరి, మెకొండ యాదగిరి, గూగుల రాజేష్ ఎన్నికయ్యారు.అదే విధంగా యూత్ కమిటీలో దేవుని ప్రకాష్ అధ్యక్షుడిగా, అరుణ్, సాయి మణి, ఉన్న తేజ, దస్తగిరి, భానుచందర్ ఉపాధ్యక్షులుగా, సచిన్ సాగర్ ప్రధాన కార్యదర్శిగా, ఓంకార్ కోశాధికారిగా, రుతిక్, అప్రోజ్ ఖాన్, అజయ్, సాయి కృష్ణ, జి. రాహుల్ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.మహిళ కమిటీలో బండి మంజుల అధ్యక్షురాలిగా, పుట్టి లక్ష్మి, కళావతి, కవిత ఉపాధ్యక్షులుగా, పుట్టి యాదగిరి ప్రధాన కార్యదర్శిగా, దిడ్డి సబిత కోశాధికారిగా, మర్కు సునీత సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.తరువాత మాట్లాడిన కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డిజీ శ్రీనివాస శర్మ, తనపై విశ్వాసం ఉంచి ఎన్నిక చేసినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకారంతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.సమావేశంలో కాలనీ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరికలు