భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలు నివాసముండే కేసీఆర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు.ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని, వారం రోజుల్లో సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు…