భారత్ సమాచార్, కొమురం భీమ్ జిల్లా: బెజ్జూర్ మండలంలో ఉపాధి హామీ పథకం లో వచ్చే ఆర్థిక సంవత్సరము 2026-2027 లో పనులు కల్పించుటకు గ్రామసభలు నిర్వహించినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలం లోని బారెగూడ, అంభాఘాట్,కుకుడ, లంబాడీగూడ 4 పంచాయతీ లో లేబర్ బడ్జెట్, మొదటి ప్రణాళిక తయారీ కొరకు మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి కూలికి పని కల్పించడమే లక్ష్యంగా ప్రణాళిక తయారు చేస్తామని తెలిపారు. గ్రామాలలో కూలీలకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉపాధి లేక కూలీలు పట్టణాలకు వలస వెళ్లకూడదని ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీవో రాజన్న, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రజనీకాంత్, కార్యదర్శులు కృష్ణమాచారి, తపన్, గురుదాస్, కవిత, సాంకేతిత సహాయకులు మురళి, రాజేష్, విజయ్, ఆశిష్ చాంద్,ఫీల్డ్ అసిస్టెంట్ లు నారాయణ, దాస్, హనుమంతు, మెట్లు, గ్రామ హక్కుదారులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి