భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

గోవుల సంరక్షణకు నాలుగు ఎకరాల భూమి కేటాయింపు: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

11

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో గోవులను గోమాతగా పూజించే సంప్రదాయాన్ని కాపాడేందుకు, బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తాండాలో గో సంరక్షణార్థం 4 ఎకరాల భూమి కేటాయించారని చెప్పారు. అలాగే గోవులకు పశుగ్రాసం కోసం ఒక ఎకరా భూమిని కేటాయించమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజనగర్ తాండలో శ్రీ ఏకచక్రేశ్వర గోశాల నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హనుమాన్ ఆలయ పూజారి ప్రవీణ్ మహారాజ్ మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, వినోద్ పట్వారి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విట్టల్, ఎసిపి శ్రీనివాస్, నాయకులు గంగా శంకర్, నాగేశ్వరరావు, పాషా మహినుద్దీన్, శరత్ రెడ్డి, తదితర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, గో సేవా, గో సంరక్షక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

National Turmeric Board: అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం