భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “దాతలు” కాకర్లపూడి రామమూర్తి రాజు, బత్తుల నరసింహారావు వారి కుమారుడు ( ఖమ్మం) వారిచే ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను MLA పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి MLA మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు. వసతులు లేని కాలంలో సాధారణ డిగ్రీలో భాగంగా సాంకేతికతను చదువుకొని విదేశాలలో కంప్యూటర్ రంగంలో ఎంతోమంది స్థిరపడటం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ ఉండే విద్యార్థులకు ఇటువంటి సౌకర్యాలు అందితే అద్భుతాలు సృష్టిస్థారనే విశ్వాసాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో MEO వీరస్వామి, హెడ్మాస్టర్ గోపి వరప్రసాద్, మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, ఓరుగంటి రమేష్ బాబు, తుక్కాని మధుసూదన్ రెడ్డి, బేతం రామకృష్ణ, లంకమల్ల కొండలరావు, తెల్లం వీరభద్రం, ఆవుల రవి, కొండాబత్తుల ఉపేందర్, సామకూర వెంకన్న, తూము వీరరాఘవులు, బరాజు సంపత్, బేతం బాబు, బచ్చు వెంకటరమణ, సింగం శ్రీధర్, దారపు శ్రీను, రావులపల్లి నరసింహారావు, మచ్చా నరసింహ రావు, గుర్రం చెన్నయ్య, వేముల విజయ్, కోలా శశికాంత్, బండి సిద్దు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఉపాధ్యాయులు, విద్యార్దులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం