భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “దాతలు” కాకర్లపూడి రామమూర్తి రాజు, బత్తుల నరసింహారావు వారి కుమారుడు ( ఖమ్మం) వారిచే ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను MLA పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి MLA మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు. వసతులు లేని కాలంలో సాధారణ డిగ్రీలో భాగంగా సాంకేతికతను చదువుకొని విదేశాలలో కంప్యూటర్ రంగంలో ఎంతోమంది స్థిరపడటం…