భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

ప్రతిపక్షం నిలబడింది.. పాలకపక్షం కూలిపోయింది!

30

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వారావుపేట నియోజకవర్గంలో రోడ్ల సమస్యపై అధికార పార్టీ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది.జగన్నాధపురం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు స్థానికులకు, ప్రయాణికులకు, వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ సమస్యపై గ్రామస్తులు అధికార పార్టీ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, సమస్యపై సానుకూలంగా స్పందించిన అశ్వారావుపేట మాజీ MLA , BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు రంగంలోకి దిగి ఇటీవల రోడ్డుపై ఏర్పడిన గుంతల వద్ద సెల్ఫీ కార్యక్రమాన్ని చేపట్టి, వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల పట్ల మెచ్చా నాగేశ్వరరావు చొరవ చూపించారు. అధికారులు, అధికార పార్టీ నాయకులు కనీసం స్పందించకపోవడంతో, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారి సూచనలుతో స్థానిక BRS పార్టీ యువకులు(PVR యూత్)సంచలన నిర్ణయం తీసుకొని తమ సొంత ఖర్చులతో రంగంలోకి దిగి గుంతల్లో వెట్ మిక్స్ ను పోసి తాత్కాలికంగా వాటిని పూడ్చి, ప్రయాణానికి ఉపశమనం కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ వైఫల్యానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలవగా, బి.ఆర్.ఎస్. పార్టీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నాయకత్వంలో, ఆయన స్ఫూర్తితో యువత తమ సొంత ఖర్చులతో పూడ్చివేయడం బి.ఆర్.ఎస్. పార్టీ ప్రజా పక్షపాతి నిబద్ధతను, మాజీ ఎమ్మెల్యే గారి క్రియాశీలతను చాటిచెబుతోంది. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మెచ్చా నాగేశ్వరరావు గారు కృషి చేస్తున్న తీరు పట్ల ప్రజలు అభినందిస్తున్నారు.