భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఇరిగేషన్ అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు

12

భారత్ సమాచార్.నెట్, అమరావతి: మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

సీఈ స్థాయి నుంచి లష్కర్ వరకు అందరూ తమ సెలవులు రద్దు చేసుకుని, తక్షణం విధుల్లో చేరాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించాలని మంత్రి స్పష్టం చేశారు. చెరువులు, కాల్వ గట్లు కోతకు గురైతే వెంటనే ఇసుక బస్తాలు, మోటార్లతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు డైవర్షన్ ఛానెల్‌పై నిరంతర నిఘా ఉంచాలని, ఓల్డ్ బుడమేరులో ప్రవాహ అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. వాగులు, రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేసే ముందు సమీప ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, రెవెన్యూ, పోలీస్ వంటి ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

ప్రెస్ నోట్: తుఫాను హెచ్చరికలు:ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు

 

మ‌రిన్ని క‌థ‌నాలు

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి