భారత్ సమాచార్.నెట్, అమరావతి: మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

సీఈ స్థాయి నుంచి లష్కర్ వరకు అందరూ తమ సెలవులు రద్దు చేసుకుని, తక్షణం విధుల్లో చేరాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించాలని మంత్రి స్పష్టం చేశారు. చెరువులు, కాల్వ గట్లు కోతకు గురైతే వెంటనే ఇసుక బస్తాలు, మోటార్లతో…