భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

WhatsApp Image 2025-10-27 at 4.48.39 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం విశేష స్పందన లభించింది. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు 99 అర్జీలను సమర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ప్రజావాణికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క అర్జీని కూడా పెండింగ్‌లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే పరిష్కార మార్గాలు చూపాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని ధర్నా