భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం విశేష స్పందన లభించింది. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు 99 అర్జీలను సమర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ప్రజావాణికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క అర్జీని కూడా పెండింగ్‌లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే పరిష్కార…





